Aparajitha Singh: తన చాంబర్ లోనే ట్రైనీ ఐపీఎస్ ను పెళ్లాడిన కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్

Krishna district JC Aparajitha Singh marries Trainee IPS Devendra Kumar
  • అత్యంత నిరాడంబరంగా వివాహం.
  • రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న అపరాజిత సింగ్, దేవేంద్ర కుమార్
  • కలెక్టరేట్ లో దండలు మార్చుకున్న వైనం
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ ఓ ఇంటివారయ్యారు. ట్రైనీ ఐపీఎస్ దేవేంద్ర కుమార్ ను అపరాజిత సింగ్ ఇవాళ మచిలీపట్నం కలెక్టరేట్ లోని తన చాంబర్లో పెళ్లాడారు. వీరిది రిజిస్టర్ మ్యారేజ్. ఈ పెళ్లి అత్యంత నిరాడంబరంగా జరిగింది. కొద్దిమంది సమక్షంలో అపరాజిత సింగ్, దేవేంద్ర కుమార్ దండలు మార్చుకున్నారు. 

అపరాజిత సింగ్ 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి కాగా, దేవేంద్ర కుమార్ హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. దేవేంద్ర కుమార్ స్వస్థలం రాజస్థాన్. ఆయన యూపీ క్యాడర్ కు చెందిన ట్రైనీ ఐపీఎస్. 

కాగా, నూతన వధూవరులకు జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఇతర ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లయిన అనంతరం అపరాజిత సింగ్, దేవేంద్ర కుమార్ వేమవరంలోని శ్రీ కొండాలమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
Aparajitha Singh
Devendra Kumar
Marriage
Collectorate
Krishna District

More Telugu News