Jailer: ‘జైలర్’ థియేటర్ల ముందు రజనీకాంత్ ఫ్యాన్స్ సందడి.. టపాసుల మోత మధ్య డ్యాన్సుల హోరు

Rajinikanth fans welcome Jailer by bursting crackers
  • ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైన ‘జైలర్’
  • ఉదయం ఆరు గంటలకే చాలాచోట్ల తొలి ఆట
  • సినిమా చూసేందుకు వచ్చిన వారిపై అభిమానుల పూలవర్షం
  • జైలర్ అని రాసి ఉన్న కారుకూ క్షీరాభిషేకం  
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్  వంటి స్టార్లు కూడా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒక్క తమిళనాడులోనే దాదాపు 900 థియేటర్లలో సినిమా రిలీజైంది. 

థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. డ్యాన్సులు వేస్తూ, టపాసులు కాలుస్తూ, డ్రమ్స్ వాయిస్తూ సందడి చేశారు. దాదాపు రెండేళ్ల తర్వాత రజనీకాంత్ నటించిన ఈ సినిమాను నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేశాడు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటలకే తొలి ఆట పడింది. 

థియేటర్ల ముందు హంగామా చేసిన ఫ్యాన్స్ సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ‘జైలర్’ అని రాసి ఉన్న కారుపై పాలు కుమ్మరించారు. మరికొన్ని చోట్ల సినిమా చూసేందుకు వచ్చిన వారిపై అభిమానులు పూలవర్షం కురిపించారు. ఏపీలో జైలర్ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ల బయట పెద్దపెద్ద కటౌట్లు ఏర్పాటు చేశారు. ఒక్క ఇండియాలోనే కాదు, అమెరికా, కెనడాలోనూ అభిమానుల సందడి ఇలాగే ఉంది.
Jailer
Rajinikanth
Nelson Dilipkumar
Tamil Nadu
Tollywood

More Telugu News