JanaSena Shatagni: కాసేపు కోడిగుడ్లు పొదగటం ఆపి.. వీటికి సమాధానాలు చెప్పు: మంత్రి అమర్నాథ్‌కు జనసేన శతఘ్ని కౌంటర్
- గుడివాడ అమన్నాథ్‌కు శతఘ్ని టీమ్ 10 ప్రశ్నలు
- నాలుగేళ్లలో అనకాపల్లిలో ఏం అభివృద్ధి చేశారని నిలదీత
- ఐటీ మంత్రిగా తెచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులు ఎన్నో చెప్పాలని డిమాండ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన విమర్శలపై ‘జనసేన శతఘ్ని’ టీమ్ కౌంటర్ ఇచ్చింది. పవన్ కల్యాణ్‌కు అమర్నాథ్ 10 ప్రశ్నలు సంధించగా.. అమన్నాథ్‌ను శతఘ్ని టీమ్ కూడా 10 ప్రశ్నలు అడిగింది.
‘‘ఐటమ్ రాజా గుడివాడ అమర్నాథ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత తరపున 10 ప్రశ్నలు. కాసేపు కోడిగుడ్లు పొదగటం ఆపేసి వీటికి సమాధానాలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం” అని ట్వీట్ చేసింది. ఈ మేరకు 10 ప్రశ్నలు సంధిస్తూ శతఘ్ని టీమ్ ఓ లేఖను పోస్ట్ చేసింది. ఈ ట్వీట్‌ను జనసేన రీట్వీట్ చేసింది.
గుడివాడ అమర్నాథ్‌కు ‘శతఘ్ని’ వేసిన ప్రశ్నలివే
- అనకాపల్లి ప్రాంతానికి నాలుగేళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి?
- ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న మీ పార్టీ అధినేత.. ఇప్పుడు మాట మార్చితే ఎందుకు ప్రశ్నించవు?
- పరిశ్రమల మంత్రిగా ఉంటూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపొద్దని గట్టిగా ఎందుకు నిలబడలేదు? ఈ విషయంలో నువ్వు ఏం చేశావు?
- ఐటీ మంత్రిగా నువ్వు తెచ్చిన పరిశ్రమలు ఎన్ని? పెట్టుబడులు ఎన్ని?
- అతి తక్కువ స్టార్టప్ కంపెనీలు వచ్చిన రాష్ట్రంగా ఏపీని నిలబెట్టిన అసమర్థుడు నువ్వు కాదా? అఖరికి నువ్వు కోడిగుడ్లు పొదగడంలో కూడా అభివృద్ధి చేయలేదు.
- రాష్ట్రంలో ఉపాధి ఎందుకు కల్పించలేకపోతున్నారు?
- ఉద్ధానం సమస్య గురించి పవన్ ప్రస్తావించకపోయి ఉంటే దానిపై ఏ ఒక్కరైనా మాట్లాడే వారా?
- మొన్న అనకాపల్లి వాలంటీర్ పింఛన్ డబ్బుతో పరారయ్యాడు. ఇందులో నీ కమీషన్ ఎంత?
- రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరు కాదా?
- ఉత్తరాంధ్ర ప్రజల పాలిట దరిద్రం నువ్వు అని, మంత్రివర్గంలో పనికిమాలిన వ్యక్తి నువ్వు అని జనం అనుకుంటున్నారు. దీనికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి.