Stock Market: ఆద్యంతం నష్టాల్లోనే.. 307 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలతో నష్టపోయిన మార్కెట్లు
- 307 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 89 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 307 పాయింట్లు కోల్పోయి 65,688కి పడిపోయింది. నిఫ్టీ 89 పాయింట్లు నష్టపోయి 19,543 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.59%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (0.88%), టైటాన్ (0.83%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.73%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.70%).
టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-2.89%), కోటక్ బ్యాంక్ (-1.63%), ఐటీసీ (-1.56%), యాక్సిస్ బ్యాంక్ (-1.12%), భారతి ఎయిర్ టెల్ (-1.05%).