Bigg Boss-7: ఈసారి బిగ్ బాస్ మీ అంచనాలకు అందడు: తాజా ప్రోమోలో నాగార్జున

Host Nagarjuna says this time Bigg Boss will be clueless
  • మరి కొన్నిరోజుల్లో బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్-7
  • ఈసారి కూడా నాగార్జునే హోస్ట్
  • కొత్త బిగ్ బాస్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందంటూ లేటెస్ట్ ప్రోమో రిలీజ్
త్వరలోనే బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ప్రారంభం కానుంది. స్టార్ మా చానల్లో ప్రసారమయ్యే ఈ భారీ రియాలిటీ షో కోసం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ రేటింగ్ తగ్గినప్పటికీ, ఈసారి ప్రోమోలు చూస్తే సరికొత్త బిగ్ బాస్ ఖాయమన్న నమ్మకం కలుగుతోంది. హోస్ట్ నాగార్జున కూడా అదే చెబుతున్నారు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్-7 మీ అంచనాలకు అందని విధంగా ఉంటుందని నాగ్ స్పష్టం చేస్తున్నారు. ఇది అంతం కాదు, ఆరంభం అంటూ చిటికేసి మరీ చెప్పారు. అంతా ఉల్టా పుల్టా అంటూ ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. ఈ మేరకు స్టార్ మా చానల్  బిగ్ బాస్-7 తాజా ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో చిన్న స్కిట్ ను కూడా ప్రదర్శించారు.
Bigg Boss-7
New Season
Promo
Nagarjuna
Host
Star Maa

More Telugu News