Sudha Murthy: పాఠ్యాంశాల తయారీ కమిటీలో సుధా మూర్తి, శంకర్ మహదేవన్

Sudha Murthy Shankar Mahadevan in new NCERT panel for content in school textbooks
  • మూడు నుంచి పన్నెండో తరగతి వరకు సిలబస్ సమీక్ష
  • కొత్త పాఠ్యాంశాల రూపకల్పన బాధ్యతలు
  • ప్రకటించిన ఎన్ సీఈఆర్ టీ
ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తి, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ కు తగిన గుర్తింపు లభించింది. మూడో తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠ్యాంశాల రూపకల్పన కమిటీలో వీరికి చోటు లభించింది. వీరితో పాటు ప్రముఖ ఆర్థిక వేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ సహా మొత్తం 19 మంది సభ్యులతో కలిపి ‘నేషనల్ సిలబస్ అండ్ టెస్టింగ్ లెర్నింగ్ మెటీరియల్ కమిటీ (ఎన్ఎస్ టీసీ)ని ఏర్పాటు చేసినట్టు ఎన్ సీఈఆర్ టీ ప్రకటించింది. ఈ కమిటీకి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చాన్స్ లర్ ఎంసీ పంత్ నాయకత్వం వహించనున్నారు.

జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా కే కస్తూరిరంగన్ ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ అభివృద్ధి చేసిన  కరిక్యులమ్ కు అనుగుణంగానే కొత్త కమిటీ కూడా పని చేయనుంది. స్కూల్ సిలబస్ అభివృద్ధి, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ (2-12 తరగతుల వరకు) రూపొందించే బాధ్యతలను కొత్త కమిటీ చూడనుంది. అలాగే ఒకటి, రెండో తరగతుల సిబలస్ సమీక్ష కూడా అవసరమేనని అభిప్రాయపడింది. ఎన్ఎస్ టీసీ అభివృద్ధి చేసి, ఖరారు చేసిన పాఠ్యాంశాలను ఎన్ సీఈ ఆర్ టీ ద్వారా పంపిణీ చేయనున్నారు.
Sudha Murthy
Shankar Mahadevan
NCERT
panel
text books
curriculum

More Telugu News