MVV Satyanarayana: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించేందుకు ఎంపీ ఎంవీవీ నో!

MP MVV satyanarayana not ready to comment on Pawan Kalyan
  • విశాఖ ఎంపీ ఎంవీవీపై జనసేన అధినేత ఘాటు వ్యాఖ్యలు
  • కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన వారితో ఎంపీ ములాఖత్ అయ్యారని జనసేనాని ఆరోపణ
  • డబ్బులతో గెలిచిన నాయకులు ఇలాగే దద్దమ్మల్లాగా ఉంటారన్న పవన్   
తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై స్పందించేందుకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిరాకరించారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏం చెబుతారని మీడియా ప్రశ్నించగా... ఆయన వ్యాఖ్యలపై స్పందించనని స్పష్టం చేశారు. అంతకుముందు, ఎంపీ ఎంవీవీపై జనసేనాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన వారితో ఎంపీ ఎంవీవీ ములాఖత్ అయ్యారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. అలాంటి ముఠాలతో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. డబ్బులతో గెలిచిన నాయకులు ఇలాగే దద్దమ్మల్లాగా ఉంటారన్నారు. ఈ వ్యవహారం ఎంపీ ఎంవీవీ ఇంటికి మాత్రమే పరిమితం కాదని, కాబట్టి తాను దీనిని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.
MVV Satyanarayana
Visakhapatnam District
Pawan Kalyan
Janasena

More Telugu News