TTD: చిరుత దాడిలో చిన్నారి మృతి నేపథ్యంలో తిరుమల నడక దారిలో టీటీడీ కీలక నిబంధనలు
- వంద మందిని ఒక గ్రూపుగా దర్శనానికి తీసుకెళ్లాలని నిర్ణయం
- వారికి తోడుగా ముందు, వెనుక రోప్ తో భద్రతా సిబ్బంది ఏర్పాటు
- చిరుతను పట్టుకునేందుకు కొనసాగుతున్న గాలింపు
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి కుటుంబ సభ్యులతో వచ్చిన ఓ చిన్నారి నడక దారిలో చిరుత దాడిలో మృతి చెందిన ఘటన నేపథ్యంలో టీటీడీ అప్రమత్తం అయింది. దర్శనానికి నడక దారిలో వెళ్తున్న భక్తుల భద్రత విషయంలో కీలక ఆంక్షలు విధించింది. అలిపిరి–తిరుమల మార్గంలో ఇకపై వంద మంది భక్తులను ఒక్కో బృందంగా దర్శనానికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. వారికి రక్షణగా ముందు వెనుక రోప్ ను, సెక్యూరిటీ గార్డులను కూడా ఏర్పాటు చేసింది.
మరోవైపు ఆరేళ్ల చిన్నారిపై దాడి చేసి చంపిన చిరుతను పట్టుకునేందుకు సంబంధిత అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక మృతదేహం లభించిన ప్రాంతాన్ని టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు.