Rahul Gandhi: ఆ విషయంలో రాహుల్ కంటే వెనుకబడ్డ ప్రధాని మోదీ

Rahul Gandhi got more viewership than PM Modi in Parliament speeches
  • పార్లమెంటులో రాహుల్ ప్రసంగాలనే ఎక్కువగా చూసిన ప్రజలు
  • అవిశ్వాసంపై చర్చలో రాహుల్ ప్రసంగాన్ని వీక్షించిన 3.5 లక్షల మంది
  • యూట్యూబ్ లో ఏకంగా 26 లక్షల మంది వీక్షించిన వైనం
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ అరుదైన ఘనతను సాధించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాహుల్ చేసిన ప్రసంగాలనే ప్రజలు ఎక్కువగా చూశారు. ఈ విషయంలో రాహుల్ కంటే ప్రధాని మోదీ వెనుకపడిపోయారు. దీనికి సంబంధించిన గణాంకాలను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 

అవిశ్వాసంపై జరిగిన చర్చలో రాహుల్ ప్రసంగాన్ని సంసద్ టీవీలో 3.5 లక్షల మంది వీక్షించారు. ఇదే సమయంలో మోదీ ప్రసంగాన్ని కేవలం 2.3 లక్షల మంది మాత్రమే వీక్షించారు. ఇక యూట్యూబ్ లో రాహుల్ ప్రసంగాన్ని 26 లక్షల మంది వీక్షించగా... మోదీ ప్రసంగాన్ని 6.5 లక్షల మంది మాత్రమే వీక్షించారని కాంగ్రెస్ పేర్కొంది. మరోవైపు సోషల్ మీడియాలో మోదీకి భారీ ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్ లో మోదీని 90.9 మిలియన్ల మంది ఫోలో అవుతున్నారు. రాహుల్ ను 24 మిలియన్ల మంది మాత్రమే ఫాలో అవుతుండటం గమనార్హం.
Rahul Gandhi
Congress
Narendra Modi
BJP
Parliament
No Confidence Motion
Debate
Viewers

More Telugu News