chandrayaan 3: కక్ష్య తగ్గింపు ప్రక్రియ విజయవంతం.. వడివడిగా జాబిల్లి వైపు చంద్రయాన్–3!

chandrayaan 3 undergoes another orbit reduction maneuver

  • 16న మరోసారి కక్ష్య తగ్గింపు ప్రక్రియను చేపట్టనున్న ఇస్రో
  • చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేరనున్న అంతరిక్ష నౌక
  • 23న చంద్రుడిపై దిగనున్న ల్యాండర్

చంద్రుడిపై పరిశోధనల కోసం పయనమైన చంద్రయాన్‌‌–3 వడివడిగా ముందుకు సాగుతోంది. జులై 14న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్–3.. సోమవారంతో నెల రోజులు పూర్తి చేసుకుంది. మరో 10 రోజుల్లో జాబిల్లిపై అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో చంద్రుడికి స్పేస్‌ క్రాఫ్ట్ మరింత దగ్గరైంది.

చంద్రయాన్–3 కక్ష్య తగ్గింపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ నుంచి ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపింది. దీంతో చంద్రుడుకి, వ్యోమనౌకకు మధ్య దూరం మరింత తగ్గింది. 

తదుపరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను 16వ తేదీన ఉదయం 8.30కి చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. తద్వారా అంతరిక్ష నౌక.. చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చేరనుంది. తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ వేరుపడనుంది. ఆ తర్వాత ఈనెల 23న చంద్రుడిపై ల్యాండర్ దిగనుంది. అంతా సజావుగా జరిగి, సాఫ్ట్ ల్యాండింగ్ జరిగితే.. రోవర్ తన పని ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News