Anasuya: అవధ్ రాణి బేగం హజ్రత్ మహల్ లా అనసూయ... ఫొటో ఇదిగో!
- 1857 విప్లవంలో కీలకపాత్ర పోషించిన అవధ్ రాణి బేగం హజ్రత్ మహల్
- తొలితరం స్వాతంత్ర్య ఉద్యమకారిణిని స్మరించుకున్న నటి అనసూయ
- ఆమె ఆహార్యాన్ని తలపించేలా దుస్తులు ధరించిన ఫొటో పోస్ట్
- భయం ఎరుగని రాణి అంటూ బేగం హజ్రత్ కు కితాబు
ఈస్ట్ ఇండియా కంపెనీపై 1857 విప్లవంలో పోరాట బావుటా ఎగురవేసిన వీరవనితగా అవధ్ రాణి బేగం హజ్రత్ మహల్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది.
రేపు భారత స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) సందర్భంగా అవధ్ రాణిని స్మరిస్తూ టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ ఆసక్తికర పోస్టు పెట్టింది. అచ్చం బేగం హజ్రత్ మహల్ ను తలపించేలా ఉన్న అనసూయను ఆ పోస్టులో చూడొచ్చు.
ఓవైపు అవధ్ రాణి చిత్రం, మరోవైపు ఆమె ఆహార్యాన్ని తలపించేలా దుస్తులు ధరించిన అనసూయ... ఈసారి తన దేశభక్తితో నెటిజన్ల దృష్టిని ఆకర్షించడంలో సఫలమైంది. 1857 విప్లవంలో కథానాయిక బేగం హజ్రత్ మహల్ కు రావాల్సినంత పేరు రాలేదని అనసూయ పేర్కొంది. భయం ఎరుగని రాణి అని కితాబునిచ్చింది.
భారత చరిత్రలో తొలితరం మహిళా స్వాతంత్ర్య ఉద్యమకారుల్లో బేగం హజ్రల్ మహల్ ఒకరని పేర్కొంది. భారతావని స్వేచ్ఛ వాయువులు పీల్చేందుకు స్వాతంత్య్రోద్యమ పోరాటాన్ని రూపుదిద్దడంలో ఆమె కీలకపాత్ర పోషించిందని అనసూయ వివరించింది. తెల్లదొరల పాలనను ఎదిరించడంలో తన జీవితంలో 20 ఏళ్ల కాలాన్ని ఆమె త్యాగం చేసిందని కొనియాడింది.