USA: అమెరికాలో బాంబులా పేలిపోయిన ఇల్లు.. వీడియో ఇదిగో!

Video Shows Moment  A House Exploded In US That Killed 5
  • పేలుడు కారణంగా మరో మూడు ఇళ్ల ధ్వంసం
  • పేలిపోయిన ఇంట్లో ఐదుగురి మృతి
  • పొరుగున ఉన్న ఇళ్లలోని ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు
అమెరికాలో ఒక ఇల్లు పేలిపోయిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ పేలుడు కారణంగా మరో మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పిట్స్ బర్గ్ లోని రెసిడెన్సియల్ ఏరియాలో ఈ పేలుడు సంభవించింది. పేలుడుకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పేలిపోయిన ఇంట్లో ఉన్న నలుగురు పెద్దలు, ఒక చిన్నారి దుర్మరణం చెందారు. పక్క ఇళ్లలో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 

USA
House
Explosion

More Telugu News