The Vaccine War: ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడి నుంచి ‘ ది వ్యాక్సిన్ వార్’.. ఆసక్తి పెంచిన టీజర్

Vivek Agnihotri Triggers Curiosity Of The Vaccine War With An Engaging Teaser To Release On 28th Sept
  • కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో పేరు తెచ్చుకున్న వివేక్ అగ్నిహోత్రి
  • సెప్టెంబర్ 28న విడుదల కానున్న వ్యాక్సిన్ వార్ చిత్రం
  • కీలక పాత్రల్లో నానా పటేకర్, అనుపమ్ ఖేర్, సప్తమి గౌడ
‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో దేశం మొత్తం సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’.  సెప్టెంబర్‌‌ 28న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన టీజర్‌‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. 

కరోనా సమయంలో  కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ బ్యాక్‌ డ్రాప్‌ లో రూపొందుతున్న ఈ చిత్రానికి పల్లవి జోషి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాలో ఆమె కీలకమైన సైంటిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. కశ్మీర్ ఫైల్స్‌ లో కీలక పాత్ర పోషించిన అనుపమ్ ఖేర్ తో పాటు నానా పటేకర్, సప్తమి గౌడ, దివ్య సేథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ నిర్మించిన అభిషేక్ అగర్వాల్.. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంలోనూ భాగం అయ్యారు. ఈ సినిమా పదికి పైగా భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
The Vaccine War
Vivek Agnihotri
kashmir files
Bollywood

More Telugu News