Devara Movie: 'దేవర'లో విలన్ సైఫ్ అలీ ఖాన్.. ఫస్ట్ లుక్ షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్

Junior NTR shares Saif Ali Khan first look in Devara Movie
  • ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో 'దేవర'
  • తారక్ సరసన నటిస్తున్న జాన్వీ కపూర్
  • సైఫ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం 'దేవర' మేనియా అప్పుడే అభిమానుల్లో మొదలయింది. ఈ చిత్రంలో తారక్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. మరోవైపు ఈ చిత్రంలో ప్రతినాయక పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ రోజు సైఫ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన లుక్ ను విడుదల చేశారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ లో లాంగ్ హెయిర్ తో సైఫ్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో సైఫ్ పాత్ర పేరు 'భైరా' అని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరోవైపు సైఫ్ లుక్ ను షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్... 'హ్యాపీ బర్త్ డే సైఫ్ సార్' అని ట్వీట్ చేశారు.
Devara Movie
Saif Ali Khan
First Look
Junior NTR
Koratala Siva
Tollywood
Bollywood

More Telugu News