YS Jagan: ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ కానుక

Andhra Pradesh government to regularise all contract employees

  • 2014 జూన్ 2 ముందు నియమితులైన ఉద్యోగుల క్రమబద్ధీకరణ
  • ఇందుకోసం ఐదేళ్ల సర్వీసు నిబంధనను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం
  • నాలుగు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది! కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసేందుకు ఐదేళ్ల సర్వీసు నిబంధనను సడలిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2014 జూన్ 2కు ముందు నియమించబడి ఇప్పటి వరకు కొనసాగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తారు. నిన్న స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేసి వారికి పండుగ కానుక ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్‌పై నాలుగు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని పేర్కొన్నారు. హామీలో భాగంగా 2014, జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే రెగ్యులర్ చేయాలని గత కేబినెట్లో తీర్మానం చేశారు. దీంతో ఐదేళ్ల సర్వీసు పూర్తికాని ఉద్యోగులకు ఈ ప్రయోజనం దక్కలేదు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తంకావడంతో ప్రభుత్వం పునఃపరిశీలన చేసింది.

  • Loading...

More Telugu News