Perni Nani: పవన్ కల్యాణ్ ఆ విషయం ధైర్యంగా చెప్పలగడా?: పేర్నినాని

Will Pawan Kalyan have guts to talk about alliance perni nani
  • చంద్రబాబు మోసగాడైతే పవన్ గజమోసగాడన్న పేర్ని నాని
  • 2019 వరకు పవన్ కల్యాణ్ వల్ల ఏపీకి ఏం ఒరిగిందని ప్రశ్న
  • ఓ టీషాప్ వ్యక్తి ఇచ్చిన డబ్బులతో లారీ కొని, వారాహిగా మార్చాడన్న మాజీ మంత్రి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు మోసగాడైతే జనసేనాని గజమోసగాడని విమర్శించారు. 2014 నుండి 2019 వరకు పవన్ కల్యాణ్ వల్ల ఈ రాష్ట్రానికి ఏం ఒరిగింది? అని నిలదీశారు. పవన్ సినిమా, సీరియల్స్ డైలాగ్‌లు కొడతారన్నారు. ఓ టీషాప్ వ్యక్తి ఇచ్చిన డబ్బులతో జనసేనాని లారీని కొని దానిని మోడిఫై చేసి, వారాహి అని పేరు పెట్టారన్నారు. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాడో చెప్పాలన్నారు. చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తున్నాడా? లేడా? చెప్పాలన్నారు. కలిసి పోటీ చేస్తున్నామని చెప్పే ధైర్యం ఉందా? అని నిలదీశారు.
Perni Nani
Janasena
Pawan Kalyan
YSRCP

More Telugu News