Ravi Shastri: కేఎల్ రాహుల్‌పై ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు.. : రవిశాస్త్రి

Ravi Shastri bats for three left handers in Indias ODI middle order

  • కేఎల్ రాహుల్‌కు తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చునన్న మాజీ ప్రధాన కోచ్
  • గాయాల నుండి కోలుకొని వచ్చాక కుదురుకొని ఆడటం కష్టమని వ్యాఖ్య
  • నాలుగో ఆటగాడిగా కోహ్లీ సరైన ప్రత్యామ్నాయం అన్న రవిశాస్త్రి

టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో గాయాలబారినపడి కోలుకుంటున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లలో ఒకరు నాలుగో స్థానంలోకి వస్తారని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రవిశాస్త్రి మాట్లాడుతూ... కేఎల్ రాహుల్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవచ్చునని వ్యాఖ్యానించారు. గాయాల నుండి కోలుకొని వచ్చాక కుదురుకొని ఆడటం కష్టమన్నారు.

గాయం నుండి కోలుకొని వచ్చిన ఆటగాడిపై ఎక్కువగా అంచనాలు పెట్టుకోవద్దని కేఎల్ రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆసియా కప్ టోర్నీ తుది జట్టులో రాహుల్ ఆడతాడని భావించడం లేదని, అతడి నుండి మరీ ఎక్కువగా ఆశించవద్దన్నారు. అందుకే భారత్ ఎదుట ఇప్పుడు నాలుగో స్థానంలో ఆడే ఆటగాడి ఎవరనే సమస్య ఉందని, అందుకు కోహ్లీ సరైన ప్రత్యామ్నాయం అన్నాడు.

రవిశాస్త్రి ఇంకా మాట్లాడుతూ... టాప్ సెవన్‌లో ముగ్గురు ఎడంచేతి వాటం బ్యాట్స్‌మెన్ భారత మిడిల్ ఆర్డర్‌ను బలపరుస్తారన్నారు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు మరో ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండవచ్చునన్నాడు.

  • Loading...

More Telugu News