Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా

AP Government gives permission to APPSC to fill vaccant jobs

  • ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం
  • పొల్యూషన్ బోర్డుతో పాటు హెల్త్ వర్సిటీలో నియామకాలు
  • మొత్తం 59 పోస్టుల భర్తీ చేపట్టాలంటూ ఆదేశం

ఆంధ్రప్రదేశ్ లోని పొల్యూషన్ బోర్డు, వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జగన్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మొత్తం 59 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల వివరాలతో ఆర్థిక శాఖ జీవోలు ఎంఎస్-95, ఎంఎస్- 96 లను విడుదల చేసింది. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయాలని సూచించింది.

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ‌కు సంబంధించిన చ‌ట్టాల అమలు, నేష‌న‌ల్ గ్రీన్ ట్రైబ్యున‌ల్ ఇచ్చిన ఆదేశాల‌ను పర్యవేక్షించడానికి సిబ్బంది కొరత ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అత్యవ‌స‌ర స‌ర్వీసుల కేట‌గిరీలో.. విజ‌య‌వాడ‌లోని వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్శిటీలో ఖాళీల భ‌ర్తీకి అనుమ‌తిచ్చిన‌ట్లు జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్ మెంట‌ల్ ఇంజినీర్ల పోస్టులు (21), గ్రేడ్ -2 ఎన‌లిస్ట్‌ల పోస్టుల (18) ను భర్తీ చేయనున్నారు. వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్లు (19), అసిస్టెంట్ లైబ్రేరియన్ (1) పోస్టులను భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది.

  • Loading...

More Telugu News