Shankar: శంకర్ బర్త్‌ డే.. ‘గేమ్‌ ఛేంజర్‌’ సెట్‌లో సెలబ్రేషన్స్‌.. ఇవిగో ఫొటోలు!

ram charan and game changer team celebrates shankar birthday on sets
  • పుట్టినరోజు సందర్భంగా శంకర్‌‌కు శుభాకాంక్షల వెల్లువ
  • గేమ్ ఛేంజర్‌‌ సెట్‌లో కేక్ కట్ చేసిన శంకర్
  • శుభాకాంక్షలు తెలియజేసిన చరణ్, దిల్ రాజు
దక్షిణాది భారీ చిత్రాల దర్శకుడు శంకర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్’ సినిమా సెట్‌లో ఆయన పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, నిర్మాత దిల్‌ రాజు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. శంకర్‌‌కు కేక్‌ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘రోబో 2.0’ తర్వాత ‘గేమ్‌ ఛేంజర్’, ‘ఇండియన్ 2’ చిత్రాలకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కిస్తున్న గేమ్‌ ఛేంజర్‌‌.. ఓ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. ఈ మూవీలో చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. కియారా అద్వానీ, శ్రీకాంత్, అంజలి, ఎస్‌జే సూర్య, సునీల్, నవీన్ చంద్ర, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 


Shankar
Game Changer
Ram Charan
Dil Raju
Sri Venkateswara Creations

More Telugu News