Karthikeya: అందుకే 'బెదురులంక' అనే పేరు పెట్టాం: హీరో కార్తికేయ

karthikeya Interview

  • కార్తికేయ హీరోగా 'బెదురులంక 2012'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • కామెడీ ప్రధానంగా సాగుతుందన్న కార్తికేయ 
  • ఈ నెల 25వ తేదీన సినిమా విడుదల


విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ కార్తికేయ ముందుకు వెళుతున్నాడు. ఆయన నుంచి రావడానికి 'బెదురులంక 2012' సినిమా రెడీ అవుతోంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో కార్తికేయ బిజీగా ఉన్నాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. 

"ఈ సినిమాలో నేను హీరో అయినప్పటికీ .. ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందువలన టైటిల్ ను నా వైపు నుంచి కాకుండా, కథ వైపు నుంచి పెట్టాలనే ఉద్దేశంతో 'బెదురులంక'ను సెట్ చేయడం జరిగింది. యుగాంతం కావడానికి ఎన్నో రోజుల సమయం లేదని తెలిసినప్పుడు, 'బెదురులంక' ప్రజలు ఎలా స్పందిస్తారు? ఎలా ప్రవర్తిస్తారు? అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుందని అన్నాడు. 

"ఇక ఈ సినిమాలో కామెడీ ట్రాక్ అనేది ప్రత్యేకంగా ఉండదు .. కథలో నుంచే అది పుట్టుకొస్తుంది. నా సినిమాలలో ఈ స్థాయి కామెడీ ఉన్న సినిమా ఇదే. ప్రెసిండెంట్ గారి కూతురుగా నేహా శెట్టి పోషించిన పాత్ర ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. ఎల్బీ శ్రీరామ్ .. అజయ్ ఘోష్ పాత్రలు నాన్ స్టాప్ గా నవ్విస్తాయి. నా పాత్ర చాలా కొత్తగా .. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చాడు.  

  • Loading...

More Telugu News