IMD: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు... ఏపీకి భారీ వర్ష సూచన
- వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
- ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందన్న ఐఎండీ
- ఏపీలో ఈ నెల 17, 18 తేదీల్లో వర్షాలు
- తెలంగాణలో ఈ నెల 18, 19 తేదీల్లో వర్షాలు
వాయవ్య బంగాఖాతంలో దక్షిణ భాగాన్ని ఆనుకుని ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, కొన్ని గంటల వ్యవధిలో ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. ఏపీ, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. ఏపీలో ఆగస్టు 17, 18 తేదీల్లో... తెలంగాణలో 18, 19 తేదీల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది.