Ramcharan: తమిళ స్టార్ డైరెక్టర్లతో రామ్‌చరణ్.. ఫొటోలు వైరల్

ram charan chiyaan vikram and others attended to shankar 60th birthday bash
  • నిన్న 60వ పుట్టిన రోజు జరుపుకున్న శంకర్
  • తమిళ ఇండస్ట్రీ దర్శకులకు పార్టీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
  • చరణ్, విక్రమ్, లోకేశ్ కనగరాజ్, వెట్రిమారన్ తదితరుల హాజరు
భారీ చిత్రాల దర్శకుడు శంకర్ నిన్న 60వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ‘గేమ్‌ ఛేంజర్‌’‌ సెట్‌లో ఆయన కేక్‌ కట్ చేశారు. అనంతరం నిన్న సాయంత్రం తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, దర్శకులకు శంకర్ పార్టీ ఇచ్చారు.

చెన్నైలో జరిగిన ఈ పార్టీకి మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొలీవుడ్ స్టార్ డైరెక్టర్లతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ వేడుకల్లో హీరో విక్రమ్‌, డైరెక్టర్లు లోకేశ్ కనగరాజ్, వెట్రిమారన్, విఘ్నేశ్ శివన్, గౌతమ్ వాసుదేవ్‌ మీనన్, లింగుస్వామి, ఎస్‌జే సూర్య, కార్తిక్ సుబ్బరాజ్, గోపీచంద్ మలినేని, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషట్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక సినిమాల విషయానికొస్తే.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్‌’‌ సినిమాలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్‌చరణ్‌ నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా ఇది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కియార్ అద్వానీ హీరోయిన్. దిల్‌ రాజు నిర్మాత.
Ramcharan
shankar
Game Changer
chennai

More Telugu News