Regina Cassandra: అడ్జెస్ట్ మెంట్ కు ఓకే అంటే ఛాన్స్ ఇస్తానన్నాడు: రెజీనా

I also faced casting couch says Regina Cassandra
  • తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ కు గురయ్యానన్న రెజీనా
  • పదేళ్ల క్రితం తనకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురయిందని వెల్లడి
  • ఆ తర్వాత మళ్లీ అలాంటి ఘటన జరగలేదన్న రెజీనా
సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై ఇప్పటికే ఎంతో మంది బహిరంగంగా మాట్లాడారు. తాజాగా హీరోయిన్ రెజీనా కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. తాను కూడా వేధింపులకు గురయ్యానని ఆమె తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి నుంచి తనకు కాల్ వచ్చిందని... అడ్జెస్ట్ మెంట్ కు ఓకే అయితే సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పాడని వెల్లడించింది. వెంటనే షూటింగ్ కూడా మొదలు పెడదామన్నాడని చెప్పింది. అయితే అడ్జెస్ట్ మెంట్ అంటే ఏమిటో కూడా తనకు తెలియదని, అదే విషయాన్ని తన మేనేజర్ ను అడిగితే వివరించాడని తెలిపింది. పదేళ్ల క్రితం తనకు ఈ అనుభవం ఎదురయిందని, ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ అలాంటి ఘటన జరగలేదని చెప్పింది. ప్రస్తుతం రెజీనా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. 

Regina Cassandra
Tollywood
Casting Couch

More Telugu News