Nara Lokesh: రేపటి నుంచి మళ్లీ నారా లోకేశ్ పాదయాత్ర

Nara Lokesh Yuvagalam continues from tomorrow

  • నేడు యువగళం పాదయాత్రకు విరామం
  • ఇవాళ కోర్టుకు హాజరైన నారా లోకేశ్
  • పోసానిపై పరువునష్టం కేసులో వాంగ్మూలం ఇచ్చిన టీడీపీ యువనేత
  • రేపు చంద్రబాబు నివాసం నుంచి లోకేశ్ పాదయాత్ర కొనసాగింపు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు నేడు (ఆగస్టు 18) విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. పోసాని కృష్ణమురళిపై పరువునష్టం కేసు దాఖలు నేపథ్యంలో, లోకేశ్ ఇవాళ మంగళగిరి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దాంతో ఇవాళ పాదయాత్ర నిలిచిపోయింది. రేపటి నుంచి యువగళం కొనసాగనుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి లోకేశ్ ముందుకు కదలనున్నారు.

యువగళం పాదయాత్ర వివరాలు

ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2496.5 కి.మీ.
188వ రోజు (19-8-2023) యువగళం వివరాలు
విజయవాడ ఈస్ట్/వెస్ట్/సెంట్రల్ నియోజకవర్గాలు (ఉమ్మడి కృష్ణాజిల్లా)
మధ్యాహ్నం
2.00 – ఉండవల్లిలోని చంద్రబాబుగారి నివాసం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
సాయంత్రం
4.00 – ఉండవల్లి సీతానగరం వద్ద పాదయాత్ర 2500 కి.మీ. చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.
4.30 – ప్రకాశం బ్యారేజి మీదుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోకి ప్రవేశం.
4.45 – విజయవాడ వన్ టౌన్ వినాయకగుడి వద్ద ఆర్యవైశ్యులతో సమావేశం.
4.55 – కాళేశ్వరరావు మార్కెట్ లో హమాలీ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ.
5.05 – రైల్వేస్టేషన్ వద్ద ఎలక్ట్రికల్ వర్కర్లతో సమావేశం.
5.10 – పాదయాత్ర విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోకి ప్రవేశం.
5.15 – పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద స్థానికులతో మాటామంతీ.
5.30 – స్వర్ణప్యాలెస్ వద్ద ఆటో వర్కర్లతో సమావేశం.
5.45 – బీసెంట్ రోడ్డులో విజయవాడ బుక్ పబ్లిషర్లతో సమావేశం.
6.00 – విజయా టాకీస్ వద్ద ముస్లిం సామాజికవర్గీయులతో భేటీ.
6.10 – కొత్తవంతెన సెంటర్ లో బ్రాహ్మణ సామాజికవర్గీయులతో సమావేశం.
6.20 – సీతారాంపురం సిగ్నల్ జంక్షన్ లో ఆర్ఎంపీలతో సమావేశం.
6.30 – చుట్టుగుంట సెంటర్ లో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లతో సమావేశం.
6.35 – పాదయాత్ర విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలోకి ప్రవేశం.
6.40 – విశాలాంధ్ర రోడ్డులో స్థానికులతో మాటామంతీ.
6.50 – మెట్రో మార్ట్ వద్ద స్థానికులతో మాటామంతీ.
రాత్రి 
8.05 – ఏ కన్వెన్షన్ సెంటర్ వద్ద విడిది కేంద్రంలో బస.

  • Loading...

More Telugu News