Nara Lokesh: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో లోకేశ్ ఫొటోల ప్రదర్శన ఏర్పాటు చేసిన ప్రత్తిపాటి టీమ్

Lokesh photo display in New York Times Square arranged by Team Prathipati
  • 4 వేల కిలోమీటర్ల యువగళం పాదయాత్ర చేపట్టిన లోకేశ్
  • ఇప్పటివరకు 2,500 కి.మీ పూర్తి
  • అమెరికా గడ్డపై లోకేశ్ కు సంఘీభావంగా ఫొటోల ప్రదర్శన
టీడీపీ యువనేత నారా లోకేశ్ 4,000 కిలోమీటర్లు నడిచే లక్ష్యంతో చేపట్టిన యువగళం పాదయాత్ర తాజాగా 2,500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద నారా లోకేశ్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు టీమ్ ఫొటోల ప్రదర్శన ఏర్పాటు చేసింది. దీనికోసం ప్రత్తిపాటి టీమ్ ఆధ్వర్యంలో టైమ్స్ స్క్వేర్ లో ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయడం విశేషం. చివరి శ్వాస వరకు మీతోనే అంటూ లోకేశ్ పాదయాత్రకు సంఘీభావంగా అమెరికా గడ్డపై ఈ ఫొటో ప్రదర్శన నిర్వహించారు.
Nara Lokesh
Times Square
New York
USA
Prathipati Pulla Rao
TDP
Yuva Galam Padayatra
Andhra Pradesh

More Telugu News