Bumrah: టీమిండియా స్టార్‌‌ బౌలర్‌‌ బుమ్రాకు గ్రెగ్‌ చాపెల్ సలహాలు!

ex india coach chappell timely advice for jasprit bumrah

  • కోహ్లీ ఆటతీరును బుమ్రా అనుసరించాలన్న గ్రెగ్ చాపెల్
  • తన మైండ్‌సెట్‌ను ఓ క్రమపద్ధతిలో సెట్ చేసుకోవాలని సూచన
  • మానసికంగా సిద్ధమైతేనే నాణ్యమైన ప్రదర్శన ఇవ్వగలడని వ్యాఖ్య

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పలు సూచనలు చేశాడు. కోహ్లీ ఆటతీరును బుమ్రా అనుసరించాలని సూచించాడు. తన మైండ్‌సెట్‌ను ఓ క్రమపద్ధతిలో సెట్ చేసుకోవాలని చెప్పాడు. దాదాపు ఏడాది తర్వాత బుమ్రా రీఎంట్రీ ఇవ్వడం, ఈ రోజు ఐర్లాండ్‌తో రెండో టీ20 ఉన్న నేపథ్యంలో చాపెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘విరాట్ కోహ్లీ కూడా గతంలో ఫామ్‌ను కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. ఫామ్‌లోకి వచ్చిన తర్వాత అదరగొట్టేస్తున్నాడు. కోహ్లీ ఆటతీరునే బుమ్రా అనుసరించాలి. గతేడాది నుంచి మైదానంలోకి దిగకపోయే సరికి బుమ్రా మైండ్ సెట్ అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. దాన్ని క్రమపద్ధతిలో సరిచూసుకోవాలి”  అని చెప్పాడు. 

ఒక్కసారి ఒక బంతి గురించి మాత్రమే బుమ్రా ఆలోచించాలని చాపెల్ చెప్పాడు. ‘‘బౌలింగ్ చేసేటప్పుడు మొదటి బాల్ బౌండరీకి వెళ్లినా.. అక్కడితోనే వదిలేయాలి. ఆ తర్వాతి బంతి గురించే ఆలోచించాలి. అప్పుడే బౌలింగ్‌పై నియంత్రణ తెచ్చుకునేందుకు ఆస్కారం ఉంటుంది” అని సూచించాడు.

గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేయడం చాలా కష్టమని, ఇందుకు మానసికంగా సిద్ధం కావాలని అన్నాడు. అప్పుడే నాణ్యమైన ప్రదర్శన ఇవ్వగలరని చెప్పాడు. అనవసర ఒత్తిడి లేకుండా బౌలింగ్ చేస్తే.. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌కు కలిసి వస్తుందని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News