Renu Desai: ‘బాహుబలి’కి రేణు దేశాయ్ ప్రశంసలు!

renu desai wishesh to bahubali team from norway
  • నార్వేలోని స్టావెంజర్‌‌ ఒపేరా హౌస్‌లో బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్‌
  • స్క్రీనింగ్‌కు కొడుకు అకీరాతో కలిసి హాజరైన రేణు దేశాయ్
  • బాహుబలికి వచ్చిన గుర్తింపు తెచ్చుకోవడం చూస్తుంటే గర్వంగా ఉందని ఇన్‌స్టాలో పోస్ట్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌ ఇటీవల నార్వేలో జరిగింది. నార్వేలోని స్టావెంజర్‌‌ ఒపేరా హౌస్‌లో జరిగిన స్క్రీనింగ్‌కు రాజమౌళి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బాహుబలి చిత్ర బృందంపై రేణు దేశాయ్ ప్రశంసలు కురిపించారు. 

స్టావెంజర్‌‌ ఒపేరా హౌస్‌లో జరిగిన స్క్రీనింగ్‌కు రేణు దేశాయ్ కూడా హాజరయ్యారు. స్క్రీనింగ్ తర్వాత సోషల్ మీడియా వేదికగా బాహుబలి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన రేణు.. ఒక భారతీయ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడం చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పారు. 

‘‘మా లాంటి ప్రేక్షకుల కోసం మీరు ఇచ్చిన ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను మాటల్లో చెప్పలేను. స్టావెంజర్‌‌లో సినిమా చూసేందుకు నన్ను, అకీరాను ఆహ్వానించినందుకు శోభు గారికి థ్యాంక్స్” అని పేర్కొన్నారు. ప్రేక్షకులు కొన్ని నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారని చెప్పారు. ఈ మేరకు ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు.


Renu Desai
bahubali
norway
Rajamouli

More Telugu News