Asia Cup: ఆసియా కప్ కు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. చోటు దక్కించుకున్న తెలుగు తేజం!
- 17 మందితో కూడిన జట్టును ప్రకటించిన బీసీసీఐ
- హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మకు చోటు
- మళ్లీ జట్టులోకి వచ్చిన రాహుల్, శ్రేయస్ అయ్యర్
త్వరలో జరగనున్న ఆసియా కప్ టోర్నీకి 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. గాయాల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కు మళ్లీ స్థానం దక్కింది. హైదరాబాద్ కు చెందన యువ కెరటం తిలక్ వర్మ జట్టులో స్థానాన్ని సంపాదించాడు. ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియాకప్ జరగనుంది. పాకిస్థాన్, శ్రీలంక వేదికల్లో టోర్నీ జరగబోతోంది. టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్, నేపాల్ మధ్య పాక్ లోని ముల్తాన్ లో జరగనుంది. ఇక ఇండియా - పాకిస్థాన్ ల మధ్య తొలి మ్యాచ్ సెప్టెంబర్ 2న శ్రీలంకలోని పల్లెకెలెలో జరుగుతుంది.
టీమిండియా ఆసియా కప్ జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. ట్రావెలింగ్ స్టాండ్ బై ప్లేయర్ (రిజర్వ్ వికెట్ కీపర్)గా సంజు శాంసన్ ను ఎంపిక చేశారు.