students: ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టిన విద్యార్థి.. ఎందుకంటే..!

IPS officer shares viral pic that shows money kept by students in answer sheets

  • తనకు పాస్ మార్కులు వేయాలంటూ వేడుకోలు
  • ఈ విషయాన్ని  ఐపీఎస్ అధికారితో పంచుకున్న టీచర్
  • బోర్డు ఎగ్జామ్ పేపర్లను దిద్దే వేళ వెలుగు చూసిన వైనం

ఎగ్జామ్ పాస్ కావాలంటే ఏం చేయాలి? కష్టపడి చదవాలి. కానీ, ఓ విద్యార్థి రాంగ్ రూట్ ఎంచుకున్నాడు. పాస్ మార్కులు వేయాలని అభ్యర్థిస్తూ ఆన్సర్ షీట్లలో కరెన్సీ నోట్లు పెట్టాడు. ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా వెల్లడించారు. ఆన్సర్ షీట్లను తెరిచినప్పుడు రూ.100, రూ.200, రూ.500 నోట్లు కనిపించడంతో వాటిని దిద్దుతున్న టీచర్ అవాక్కవ్వాల్సి వచ్చింది.

మంచిగా చదివి, మెరుగైన మార్కులు సంపాదించుకుందామన్న ఆలోచనకు బదులు.. లంచంతో పాస్ అయిపోదామన్న విద్యార్థుల ధోరణి ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. జవాబు పత్రాలను దిద్దే ఓ టీచర్ కరెన్సీ నోట్లను గుర్తించిన విషయాన్ని ఐపీఎస్ అధికారి బోత్రాతో పంచుకోగా, ఆయన దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ పట్ల వారిలో ఆందోళన వ్యక్తమైంది. 

‘‘ఈ ఫొటోని ఓ టీచర్ పంపించారు. బోర్డు పరీక్షల్లో ఓ విద్యార్థి ఆన్సర్ షీట్ల మధ్య నోట్లను ఉంచినట్టు చెప్పారు. పాస్ మార్కులు వేయాలన్న అభ్యర్థన అక్కడ రాసి ఉంది. మన విద్యార్థులు, టీచర్లు, మొత్తం విద్యా వ్యవస్థ గురించి ఇది తెలియజేస్తోంది’’ అని అరుణ్ బోత్రా తన స్పందన వ్యక్తం చేశారు. విషయం ఏమిటంటే ఇదే విధమైన అనుభవం తమకూ ఎదురైందంటూ ట్విట్టర్ లో ఈ పోస్ట్ ను చూసి మరికొందరు టీచర్లు స్పందించారు. అడిగిన ప్రశ్నకు సమాధానానికి బదులు, ఓ విషాదగాథను రాసి, డబ్బులు ఉంచుతుండడం టీచర్లను ఆత్మరక్షణలో పడేస్తోంది.

  • Loading...

More Telugu News