Sachin Tendulkar: ఎన్నికల ప్రచారకర్తగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్
- బుధవారం ఢిల్లీలో ఒప్పందం కుదుర్చుకోనున్న ఈసీ
- ఒప్పందంలో భాగంగా మూడేళ్లపాటు ఓటు హక్కుపై అవగాహన కల్పించనున్న సచిన్
- 2024లో యువ ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుందన్న ఈసీ
భారత ఎన్నికల సంఘం ఎన్నికల ప్రచారకర్తగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను నియమించనుంది. బుధవారం ఢిల్లీలోని రంగ్ భవన్ ఆడిటోరియంలో క్రికెట్ దిగ్గజంతో ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఓటింగ్‌పై సచిన్ మూడేళ్ల పాటు అవగాహన కల్పించనున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో యువ ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఎన్నికల సంఘం తెలిపింది.
పట్టణ ప్రాంతాలు, యువతలో ఓటింగ్ పట్ల ఉన్న ఉదాసీనతలో మార్పు తీసుకురావడానికి ఈసీ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ప్రచారకర్తలుగా నియమిస్తోంది. గత ఏడాది బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠిని, అంతకంటే ముందు మహేంద్ర సింగ్ ధోనీ, నటుడు ఆమిర్ ఖాన్, మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్‌లను ప్రచారకర్తలుగా నియమించింది.