Prakash Raj: చంద్రయాన్​3 సక్సెస్​ తర్వాత ‘అరెస్ట్​ ప్రకాశ్​ రాజ్’​ అంటూ ట్విట్టర్​లో ట్రెండింగ్​!

Arrest Prakash Raj trends on X after controversial post over Chandrayaan3
  • చంద్రయాన్ గురించి ప్రకాశ్ రాజ్ వివాదాస్పద ట్వీట్
  •  చంద్రుడి నుంచి పంపిన తొలి ఫొటో ఇదేనంటూ ఓ వ్యక్తి టీ పోస్తున్నట్టుగా ఉన్న కార్టూన్ షేర్ చేసిన నటుడు
  •  నటుడిని అరెస్ట్ చేయాలని పలువురి డిమాండ్ 
చంద్రయాన్3 విజయవంతం అవడంతో  దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రోను, శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే సమయంలో చంద్రయాన్3ని అపహాస్యం చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేసినందుకు నటుడు ప్రకాశ్ రాజ్‌ను అరెస్ట్ చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ ఈ నెల 20న చొక్కా, లుంగీ ధరించిన ఓ వ్యక్తి టీ పోస్తున్నట్టుగా ఉన్న ఓ కార్టూన్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి నుంచి పంపిన తొలి ఫొటో ఇదే అని పేర్కొన్నారు.

దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై ఉన్న ద్వేషాన్ని ఆయన దేశ శాస్త్రవేత్తలపై చూపిస్తున్నారని, చారిత్రాత్మక మిషన్‌ను అపహాస్యం చేశారంటూ పలువురు దుయ్యబట్టారు. ఇప్పుడు చంద్రయాన్3 సక్సెస్ కావడంతో ప్రకాశ్ రాజ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో, ‘అరెస్ట్ ప్రకాశ్ రాజ్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ (ఎక్స్)లో ట్రెండ్ అవుతోంది.
Prakash Raj
Twitter
Chandrayaan3
arrest

More Telugu News