NCP: మా పార్టీ చీలలేదు.. అజిత్ మా వాడే!: శరద్ పవార్

No split in NCP Ajit still its leader Sharad Pawar

  • ఎన్సీపీలో చీలిక లేదన్న శరద్ పవార్
  • అజిత్ పవార్ ఇప్పటికీ పార్టీ నేతగానే ఉన్నట్టు వెల్లడి
  • భిన్నమైన వైఖరి ప్రజస్వామ్యంలో సాధారణమేనన్న అధినేత

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) లో ఎలాంటి చీలిక లేదంటూ ఆ పార్టీ అధినేత శరద్ పవార్ కొట్టి పడేశారు. ఆయనకు వరుసకు కుమారుడైన (అన్నయ్య అనంతరావ్ పవార్ కుమారుడు) అజిత్ పవార్ తనకు మద్దతుగా నిలిచే మెజారిటీ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలసి వెళ్లి బీజేపీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వంలో చేరడం తెలిసిందే. డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం అజిత్ పవార్ పనిచేస్తున్నారు.

అజిత్ పవార్ తిరుగుబాటు కేవలం భిన్న వైఖరి తీసుకోవడమేనని శరద్ పవార్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది ఆమోదనీయమేనని చెప్పారు. తన కుమారుడు ఇప్పటికీ ఎన్సీపీ నేతగానే ఉన్నట్టు స్పష్టం చేశారు. దద్వారా తన కుమారుడిని సమర్థించారు. ‘‘అజిత్ పవార్ మా నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ పార్టీలో చీలిమా పార్కటీ చీలలేదు.. అజిత్ మా వాడే  అంటే ఏంటి? జాతీయ స్థాయిలో ఓ పార్టీలో మెజారిటీ వర్గం వేరుపడినప్పుడే ఇది సాధ్యపడుతుంది. కానీ, అలాంటి పరిణామం ఏదీ ఇక్కడ లేదు కదా’’ అని శరద్ పవార్ అన్నారు. కోల్హాపూర్ కు వెళ్లే ముందు పూణెలోని తన నివాసం ముందు పవార్ మీడియాతో మాట్లాడారు.

దీనికంటే ముందు శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే అజిత్ పవార్ గురించి మాట్లాడుతూ.. ఎన్సీపీలో ఎలాంటి చీలిక లేదంటూ అజిత్ పవార్ ఇప్పటికీ తమ నేతగానే ఉన్నట్టు ప్రకటించడం గమనార్హం. ‘‘పార్టీకి వ్యతిరేకమైన వైఖరి తీసుకున్నారు. దీంతో మేము స్పీకర్ కు ఫిర్యాదు చేశాం. స్పీకర స్పందన కోసం వేచిచూస్తున్నాం’’ అని సూలే చెప్పారు.

  • Loading...

More Telugu News