Sivaraj Kumar: దసరా కానుకగా శివరాజ్ కుమార్ 'ఘోస్ట్'...  అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ రిలీజ్

Sivaraj Kumar starring Ghost will release on October 19
  • రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రబృందం
  • పాన్ ఇండియా లెవల్లో యాక్షన్ థ్రిల్లర్ గా ఘోస్ట్
  • శ్రీని దర్శకత్వంలో హైఓల్టేజ్ మూవీ
కన్నడ అగ్రహీరో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్యాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోన్న చిత్రం 'ఘోస్ట్'. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీని 'ఘోస్ట్' చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయ నాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఘోస్ట్ ను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల చేయనున్నారు. తాజాగా ఆకట్టుకునే పోస్టర్ తో  రిలీజ్ డేట్  అనౌన్స్ చేశారు. శివరాజ్ కుమార్ గన్ తో సీరియస్ లుక్ తో ఉన్న రిలీజ్ పోస్టర్ 'ఘోస్ట్' ఆగమనాన్ని ఘనంగా ప్రకటిస్తోంది. 

పోస్టర్ మీద ఉన్న క్యాప్షన్ "When Shadows Speak... Know The Ghost Is Arriving" అంచనాలు మరింత పెంచేలా ఉంది. 

ఘోస్ట్ నుండి వచ్చిన కాన్సెప్ట్ మోషన్ పోస్టర్, టీజర్ ల తర్వాత అటు ట్రేడ్ వర్గాల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ చిత్రంపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం అక్టోబర్ రెండవ వారం నుండి దేశవ్యాప్తంగా స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తోంది. సెప్టెంబర్ రెండవ వారంలో ట్రైలర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఘోస్ట్ చిత్రంలో ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘ఘోస్ట్’ చిత్రానికి అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు.
Sivaraj Kumar
Ghost
Release Date
Srini
Kannada

More Telugu News