CM Jagan: సాయం కోరిన క్యాన్స‌ర్ బాధితురాలికి సీఎం జగన్ సాయంత్రానికల్లా రూ.3 లక్ష‌లు అందజేశారు: మంత్రి బొత్స

Botsa says CM Jagan helped a cancer patient very swiftly
  • క్యాన్సర్ తో తల్లిదండ్రులను కోల్పోయిన సరస్వతి
  • గత ఐదేళ్లుగా తాను కూడా క్యాన్సర్ తో బాధపడుతున్న యువతి
  • ఆసరా లేక సాయం కోసం ఎదురుచూస్తున్న వైనం
  • చినమేడిపల్లిలో గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్
  • ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ను కలిసిన సరస్వతి
సీఎం జగన్ మానవతా దృక్పథంతో ఓ క్యాన్సర్ బాధితురాలికి సాయపడ్డారు. ఈ విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సాయం కోరిన క్యాన్సర్ వ్యాధిగ్రస్తురాలికి సీఎం జగన్ సాయంత్రానికల్లా రూ.3 లక్షలు అందజేశారని తెలిపారు. 

ఆ క్యాన్సర్ బాధితురాలి పేరు కన్నూరు సరస్వతి (34)... ఆమెది నిజంగా అత్యంత విషాద గాథ అని బొత్స పేర్కొన్నారు. 

"విజయనగరం జిల్లా గరివిడి మండలం కొండదాడి గ్రామానికి చెందిన కన్నూరు సరస్వతి తల్లిదండ్రులు ఇద్దరూ క్యాన్సర్ కు బలయ్యారు. సరస్వతికి తోబుట్టువులు ఎవరూ లేరు. ఐదేళ్లుగా ఆమె కూడా క్యాన్సర్ తో బాధపడుతోంది. గొంతు క్యాన్సర్ కు గురైన సరస్వతి సాయం కోసం ఎదురుచూస్తోంది. 

ప్రస్తుతం ఆమె వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పింఛను పొందేందుకు నిబంధనలు అడ్డువస్తున్నాయి. దాంతో, చినమేడపల్లిలో గిరిజన వర్సిటీ శంకుస్థాపనకు వచ్చిన సీఎం జగన్ ను కలుసుకుని తన దయనీయ పరిస్థితిని ఆయనకు వివరించింది. 

సరస్వతి విషాద గాథ విని సీఎం జగన్ చలించిపోయారు. అక్కడికక్కడే ఆమెకు రూ.3 లక్షల సాయం ప్రకటించారు. ఆ రూ.3 లక్షల మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందించాలని నిర్ణయించారు. 

ఆ మేరకు రెవెన్యూ అధికారులు చెక్ ను సిద్ధం చేయగా, ఈ రోజు సాయంత్రమే చెక్ ను ఆ క్యాన్సర్ బాధితురాలికి అందించాం" అని మంత్రి బొత్స వివరించారు.
CM Jagan
Botsa Satyanarayana
Saraswathi
Cancer Patient
Vijayanagaram District

More Telugu News