Anand Mahindra: క్రికెట్ కాదు, సినిమాలు కాదు... అత్యధిక వ్యూస్ చంద్రయాన్-3కి దక్కాయి: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra talks about Chandrayaan 3 live streaming views in youtube
  • ఆగస్టు 23న చంద్రయాన్-3 ల్యాండింగ్ 
  • యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్
  • రికార్డు స్థాయిలో 8.06 మిలియన్ల వీక్షణలు
  • యూట్యూబ్ స్ట్రీమింగ్ చరిత్రలో ఇప్పటివరకు ఇదే నెంబర్ వన్
  • సైన్స్ అండ్ టెక్నాలజీకి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండనుందన్న ఆనంద్ మహీంద్రా
ఇటీవల భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ల్యాండింగ్ పై యావత్ ప్రపంచం దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా చంద్రయాన్-3 ల్యాండింగ్ లైవ్ టెలికాస్ట్ లే దర్శనమిచ్చాయి. దాంతో వ్యూయర్షిప్ రేటింగ్ అదిరిపోయింది. 

అంతర్జాతీయ సాకర్ మ్యాచ్ లు, బీటీఎస్ మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శనలు, స్పేస్ ఎక్స్ క్రూ డెమో... ఇవన్నీ కూడా మన చంద్రయాన్ తర్వాతే. గ్లోబల్ ఇండెక్స్ సంస్థ యూట్యూబ్ లో ఇప్పటివరకు అత్యధిక వ్యూస్ సాధించిన లైవ్ స్ట్రీమింగ్ ల జాబితాను విడుదల చేసింది. ఇందులో 8.06 మిలియన్ల వ్యూస్ తో చంద్రయాన్-3 నెంబర్ వన్ గా నిలిచింది. 

దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. "క్రికెట్ కాదు, సినిమాలు కాదు... వ్యూస్ పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ఘనత సాధించింది. గర్వించాల్సిన విషయం ఇది. శాస్త్రవిజ్ఞాన రంగం వ్యూయర్షిప్ రేసులో అగ్రస్థానం అలంకరించింది. భవిష్యత్ ఉజ్వలంగా ఉండనుంది... అందులో ఎలాంటి సందేహం లేదు" అంటూ ట్వీట్ చేశారు.
Anand Mahindra
Chandrayaan-3
Live Streaming
Youtube

More Telugu News