Nara Lokesh: దాదాపు సగం పాదయాత్ర పూర్తి చేసుకున్న నారా లోకేశ్
- జనవరి 27న ప్రారంభమైన యువగళం
- గత 196 రోజులుగా పాదయాత్ర
- ఇప్పటివరకు 2,615 కిలోమీటర్ల పూర్తి
- 400 రోజులు... 4000 కిలోమీటర్లు సాగనున్న లోకేశ్ యువగళం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలోని యువత సమస్యలను వినేందుకు, వారిలో భరోసా నింపేందుకు యువగళం పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. 400 రోజులు, 4000 కిలోమీటర్లు... సుదీర్ఘ పాదయాత్ర అయినప్పటికీ, లోకేశ్ ఉత్సాహంతో ముందడుగు వేశారు.
కుప్పంలో జనవరి 27న ప్రారంభమైన యువగళం అనేక నియోజకవర్గాలు, జిల్లాలు దాటుతూ ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా చేరుకుంది. ఓ వైపు సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుంటూ, స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఆధారంగా లోకేశ్ ప్రసంగాలు సాగుతున్నాయి. మరోవైపు, టీడీపీ మేనిఫెస్టోలోని కీలక అంశాలను ప్రజలకు చేరువ చేసేందుకు తన యువగళం పాదయాత్రను లోకేశ్ వినియోగించుకుంటున్నారు. కొన్నిచోట్ల పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు, అధికార వైసీపీ నుంచి తీవ్ర విమర్శల నేపథ్యంలో, లోకేశ్ సగం పాదయాత్రను పూర్తి చేశారు.
ఈ నేపథ్యంలో... ఏ నియోజకవర్గంలో ఎన్నిరోజులు పాదయాత్ర చేశారంటే...
*ఉమ్మడి జిల్లాల వారీగా యువగళం పాదయాత్ర వివరాలు*
*చిత్తూరు – 14 నియోజకవర్గాలు – 45రోజులు – 577 కి.మీ.*
*అనంతపురం – 9 నియోజకవర్గాలు – 23రోజులు – 303 కి.మీ.*
*కర్నూలు – 14 నియోజకవర్గాలు – 40రోజులు – 507 కి.మీ.*
*కడప – 7 నియోజకవర్గాలు – 16రోజులు – 200 కి.మీ.*
*నెల్లూరు – 10 నియోజకవర్గాలు – 31రోజులు – 459 కి.మీ.*
*ప్రకాశం – 8 నియోజకవర్గాలు – 17రోజులు – 220 కి.మీ.*
*గుంటూరు – 7 నియోజకవర్గాలు – 16రోజులు – 236 కి.మీ.*
*కృష్ణా జిల్లా – 6 నియోజకవర్గాలు – 8రోజులు – 113 కి.మీ.లు*
*మొత్తం – 75 నియోజకవర్గాలు – 196రోజులు – 2615 కి.మీ.*