Somu Veerraju: భూమనపై సోము వీర్రాజు సంచలన ఆరోపణలు

Somu Veerrajus sensational comments against Bhumana Karunakar Reddy
  • భూమన తమ డిక్లరేషన్‌లో ‘క్రిస్టియన్’ అని ఇచ్చినట్లు తెలుస్తోందన్న సోము వీర్రాజు
  • క్రైస్తవం మీద అభిమానం ఉన్న వ్యక్తుల్ని టీటీడీ చైర్మన్‌గా నియమించడం సరికాదని వ్యాఖ్య
  • దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్
టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌‌రెడ్డిపై ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. భూమన క్రైస్తవ డిక్లరేషన్‌ ఇచ్చినట్లు తమకు తెలిసిందని చెప్పారు. అలాంటి వారిని టీటీడీ చైర్మన్‌గా నియమించడం సరికాదని విమర్శించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

‘‘భూమన తమ డిక్లరేషన్‌లో ‘క్రిస్టియన్’ అని ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం దీనిపై స్పందించాల్సిన బాధ్యత ఉంది. క్రైస్తవ మతం మీద అభిమానం ఉన్న వ్యక్తుల్ని మరోసారి నియమించడం హర్షించదగ్గ పరిణామం కాదు. దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది” అని చెప్పారు.
Somu Veerraju
Bhumana Karunakar Reddy
TTD
BJP
YSRCP
cristian

More Telugu News