Balka Suman: కాంగ్రెస్ పార్టీలోకి కోవర్టులను పంపాం.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

BRS Chennur MLA Balka Suman Sensational Comments On Congress
  • కాంగ్రెస్ వాళ్లను ఏమీ అనొద్దని కార్యకర్తలకు బాల్క సుమన్ హితవు
  • ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దన్న చెన్నూరు ఎమ్మెల్యే
  • మైండ్‌గేమ్‌లో భాగమేనని కాంగ్రెస్ మండిపాటు
బీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లు మనోళ్లేనని, ఆ పార్టీలో మన కోవర్టులు ఉన్నారని, కాబట్టి వారినేమీ అనొద్దని కార్యకర్తలకు హితవు పలికారు. పార్టీ అధిష్ఠానం తనకు చెన్నూరు టికెట్ కేటాయించడంపై నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

గత ఎన్నికల్లో తనపై పోటీ చేసిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ బీఆర్ఎస్‌లోకి వచ్చారని, మిగతా వాళ్లు కూడా వస్తారని, అందరూ మనోళ్లేనని అన్నారు. అసలు విషయం ఏంటంటే.. మనమే కొందరిని పార్టీలోకి పంపించామని, ఈ విషయాన్ని బయట చెప్పొద్దని కోరారు. 

బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మైండ్‌గేమ్‌లో భాగంగానే ఆయనీ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాల్క సుమన్ వ్యాఖ్యలు సొంత పార్టీలోనూ చర్చనీయాంశమయ్యాయి.
Balka Suman
BRS
Chennur
Congress

More Telugu News