Anu Immanuel: నాక్కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి: క్యాస్టింగ్ కౌచ్ పై అనూ ఇమ్మాన్యుయేల్

Anu Immanuel bold statement on casting couch
  • క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందేనన్న అను
  • ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యుల సహకారంతో ఎదుర్కోవాలని వ్యాఖ్య
  • ఒత్తిడికి గురయినప్పుడు ఫ్యామిలీ అండ తీసుకోవాలని సూచన
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది బహిరంగ రహస్యమే. తాము లైంగిక వేధింపులకు గురయ్యామంటూ ఇప్పటికే ఎంతో మంది నటీమణులు బహిరంగంగా వెల్లడించారు. తాజాగా ఈ జాబితాలో యువ నటి అనూ ఇమ్మాన్యుయేల్ కూడా చేరింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందేనని అను చెప్పింది. తనకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని తెలిపింది. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యుల సహకారంతో వాటిని ఎదుర్కోవాలని చెప్పింది. ఒత్తిడికి గురయినప్పుడు కుటుంబ సభ్యులతో చెప్పి, వారి అండ తీసుకోవాలని తెలిపింది. 26 ఏళ్ల అను 2011లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. నాని హీరోగా నటించిన 'మజ్ను' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
Anu Immanuel
Tollywood
Casting Couch

More Telugu News