Andhra Pradesh: రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఫోన్లను నిషేధించిన ఏపీ ప్రభుత్వం

AP Govt bans mobile phones in schools

  • విద్యార్థులు స్కూళ్లకు ఫోన్లను తీసుకురాకూడదని ఉత్తర్వులు
  • ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి ఫోన్లను తీసుకురాకూడదని ఆదేశాలు
  • నిబంధనలు ఉల్లంఘించే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక

ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించింది. పాఠశాలలకు విద్యార్థులు ఫోన్లను తీసుకురాకుండా ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులు సైతం తమ ఫోన్లను తరగతి గదుల్లోకి తీసుకురాకూడదని ఆదేశించింది. తరగతి గదులకు వెళ్లే ముందు ఉపాధ్యాయులు తన ఫోన్లను ప్రధానోపాధ్యాయుడికి అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

బోధనకు ఎలాంటి ఆటంకం రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించే ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా ప్రధానోపాధ్యాయులు, ఉన్నతాధికారులు చూడాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News