Rajinikanth: తాను కండక్టర్‌‌గా పని చేసిన బస్ డిపోను సందర్శించిన రజనీకాంత్.. ఇవిగో ఫొటోలు!

rajanikanth visits bmtc depot in jayanagar where he worked before entering films
  • సినిమాల్లోకి రాకముందు బస్సు కండక్టర్‌‌గా పని చేసిన రజనీకాంత్
  • బెంగళూరులో జయనగర్ బీఎంటీసీ డిపోకు వెళ్లిన సూపర్ స్టార్
  • ఎంతో సంతోషం వ్యక్తం చేసిన సిబ్బంది.. ఫొటోలు వైరల్
‘జైలర్’ సినిమాతో ఇటీవల హిట్ అందుకున్నారు సౌతిండియా సూపర్‌‌స్టార్ రజనీకాంత్. రూ.600 కోట్ల వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది. మరోవైపు హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ముందుకు సాగుతుంటారు రజనీకాంత్. నిరాడంబరంగా గడుపుతుంటారు. తన మూలాలను ఎన్నడూ మరచిపోలేదు. ఈ నేపథ్యంలో తాను గతంలో పని చేసిన సంస్థను సందర్శించారు రజనీకాంత్.

సినిమాల్లోకి రాకముందు ఆయన బస్సు కండక్టర్‌‌గా పని చేసిన విషయం తెలిసిందే. కర్ణాటక రాజధాని బెంగళూరులో జయనగర్ బీఎంటీసీ డిపోలో ఆయన పని చేసేవారు. ఈ రోజు అక్కడికి వెళ్లారు. అకస్మాత్తుగా రజనీకాంత్‌ను చూసిన సిబ్బంది ఆనందానికి అవధుల్లేవు. చాలా సంతోషం వ్యక్తం చేశారు. సెల్ఫీలు తీసుకున్నారు. వారితో రజనీకాంత్ కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rajinikanth
Bengaluru
Karnataka
Bus Depot
conductor

More Telugu News