Chandrababu: తెలంగాణలో పోటీ, పొత్తులపై చంద్రబాబు కీలక ప్రకటన

TDP will contest single in Telangana says Chandrababu
  • తెలంగాణలో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందన్న చంద్రబాబు
  • పొత్తులపై చర్చలకు సమయం మించి పోయిందని వ్యాఖ్య
  • ఏపీలో అవసరాలను బట్టి పొత్తులు ఉంటాయని వెల్లడి
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ, పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ పొత్తులపై చర్చించేందుకు సమయం మించిపోయిందని చెప్పారు. తెలంగాణలో ఎన్ని స్థానాల్లో, ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే విషయాన్ని కమిటీ నిర్ణయిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అవసరాలను బట్టి పొత్తులు ఉంటాయని చెప్పారు. మరోవైపు ఏపీలో టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ కూటమిలో బీజేపీ కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ... ఆ పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.
Chandrababu
Telugudesam
Telangana
Elections
Alliances

More Telugu News