Drones: రష్యాలోని పొస్కోవ్ ఎయిర్ పోర్టుపై విరుచుకుపడిన డ్రోన్లు

Drones attack on Pskov airport in Russia
  • గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య ప్రారంభం
  • తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్
  • అదే సమయంలో రష్యా ఎయిర్ పోర్టులు, కీలక స్థావరాలపై డ్రోన్ దాడులు
  • తాజా దాడిలో నాలుగు రవాణా విమానాలకు నష్టం
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య ప్రారంభించి ఏడాదిన్నర దాటింది. ఉక్రెయిన్ ను తీవ్రంగా నష్ట పరచాలన్న రష్యా ఉద్దేశం నెరవేరినప్పటికీ, రష్యా కూడా పలు రూపాల్లో నష్టపోయింది. ఎక్కడి నుంచి వస్తాయో తెలియని డ్రోన్లు రష్యాలోని ఎయిర్ పోర్టులపై, కీలక స్థావరాలపై దాడి చేసిన ఘటనలు ఇప్పటికే పలుమార్లు జరిగాయి. 

తాజాగా రష్యాలోని పొస్కోవ్ ఎయిర్ పోర్టుపైనా డ్రోన్లు విరుచుకుపడ్డాయి. మొత్తమ్మీద నాలుగు కార్గో విమానాలను ఈ డ్రోన్లు దెబ్బతీయగలిగాయి. ప్రపంచంలోనే అత్యంత భారీ రవాణా విమానాలుగా పేరుగాంచిన ఇల్యూషిన్-76 విమానాలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. 

కాగా, ఈ దాడిలో పాల్గొన్న డ్రోన్లపై రష్యా సైన్యం ప్రతిదాడులకు దిగింది. డ్రోన్ల దాడిలో ప్రాణనష్టం జరగలేదని, విమానాలు మంటల్లో చిక్కుకున్నాయని అధికారులు తెలిపారు. దాడుల విషయాన్ని స్థానిక గవర్నర్ నిర్ధారించారు.
Drones
Pskov Airport
Russia
Ukraine

More Telugu News