Rs 2000 note: రూ.2 వేల నోట్లు ఇంకా మార్చుకోలేదా.. గడువు సమీపిస్తోంది త్వరపడండి!

Keep in mind this is the last date to exchange Rs 2000 notes in banks

  • సెప్టెంబర్ 30 తో ముగియనున్న గడువు
  • ఏ బ్యాంకులోనైనా మార్చుకునే అవకాశం
  • సెప్టెంబర్ లో బ్యాంకులకు సెలవులు ఎక్కువ

మీ దగ్గర ఇంకా రూ. 2 వేల నోట్లు ఉన్నాయా.. వ్యాపారంలో ఇటీవలే మీ చేతికి అందాయా? అయితే, వెంటనే వాటిని మార్చేసుకోండి. ఈ నోట్లను మార్చుకోవడానికి గడువు దగ్గరపడింది. వచ్చే నెల (సెప్టెంబర్ 30) తో పెద్ద నోటను మార్చుకునే గడువు పూర్తవుతుంది. ఆ తర్వాత మార్చుకోవడం అంత తేలిక కాదు. పైగా సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు పనిదినాల కన్నా సెలవులే ఎక్కువగా ఉన్నాయి. చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ఇప్పుడే రూ.2 వేల నోట్లను మార్చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ దగ్గరున్న రూ.2 వేల నోట్లను సమీపంలోని బ్యాంకుకు తీసుకెళ్లి క్యాష్ కౌంటర్ లో ఒక దఫాలో రూ.20 వేల వరకు (10 నోట్లు) మార్చుకోవచ్చు. లేదా మీ ఖాతాలో జమ చేసుకునే వీలు కూడా ఉంది. 

పెద్ద నోట్ల రద్దు తర్వాత చలామణిలోకి తెచ్చిన రూ.2 వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే 19న ఈ ప్రకటన చేసిన ఆర్బీఐ.. రూ.2 వేల నోటును మార్చుకోవడానికి నాలుగు నెలల సమయం ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకు ఏ బ్యాంకులోనైనా రూ. 2 వేల నోటును మార్చుకోవచ్చని తెలిపింది. దీనికి మరో 30 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.

  • Loading...

More Telugu News