Sensex: ఆగస్ట్ ను నష్టాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు
- 255 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 93 పాయింట్లు పతనమైన నిఫ్టీ
- 1.33 శాతం పడిపోయిన ఏసియన్ పెయింట్స్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. మంత్లీ, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్ పైరీ నేపథ్యంలో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 255 పాయింట్లు నష్టపోయి 64,831కి పడిపోయింది. నిఫ్టీ 93 పాయింట్లు పతనమై 19,253కి దిగజారింది.
మారుతి (2.22%), టైటాన్ (1.09%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.02%), టాటా స్టీల్ (0.78%), టెక్ మహీంద్రా (0.68%).
ఏసియన్ పెయింట్స్ (-1.33%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.20%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.12%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.10%), బజాజ్ ఫైనాన్స్ (-1.07%).