Teachers: సెప్టెంబరు 2 నుంచి తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు

Teachers transfers takes place in Telangana from September 2
  • ఇటీవల తెలంగాణ హైకోర్టు తుది తీర్పు
  • స్టే ఎత్తివేసిన న్యాయస్థానం
  • టీచర్ల బదిలీలకు తొలగిన అడ్డంకులు
  • రేపటిలోగా షెడ్యూల్ విడుదల చేయనున్న విద్యాశాఖ
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు కసరత్తులు చేస్తోంది. సెప్టెంబరు 2 నుంచి రాష్ట్రంలో టీచర్ల బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇటీవల టీచర్ల బదిలీలకు తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపడంతో కేసీఆర్ ప్రభుత్వం ముందడుగు వేసింది. తుది తీర్పునకు లోబడే బదిలీలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ విద్యాశాఖ రేపటి లోగా షెడ్యూల్ విడుదల చేయనుంది. 

ఈ బదిలీ ప్రక్రియలో... భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులైతే వారికి అదనపు పాయింట్లు కేటాయించనున్నారు. టీచర్ల బదిలీలపై జనవరిలోనే షెడ్యూల్ విడుదలైంది. హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇన్నాళ్లు జాప్యం జరిగింది. ఇటీవలే న్యాయస్థానం స్టే ఎత్తివేయడంతో బదిలీలకు అవరోధాలు తొలగిపోయాయి.
Teachers
Transfers
Telangana
High Court

More Telugu News