Jagan: రేపు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ఏపీ సీఎం జగన్

AP CM Jagan will release Rythu Bharosa funds tomorrow
  • తాజా సీజన్ కోసం సెప్టెంబరు 1న తొలి విడత పెట్టుబడి సాయం
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కనున్న సీఎం జగన్
  • రూ.109.74 కోట్లు రైతుల ఖాతాల్లోకి బదిలీ
ఏపీ సీఎం జగన్ రేపు (సెప్టెంబరు 1) రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. వాస్తవానికి రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం నేడు జరగాల్సి ఉండగా రేపటికి వాయిదా పడింది. శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నారు. 

పీఎం కిసాన్ సమ్మాన్-వైఎస్సార్ రైతు భరోసా పథకంలో భాగంగా రాష్ట్ర  ప్రభుత్వం తన వంతుగా రైతులకు ఏటా రూ.7,500 పెట్టుబడి సాయం కింద అందజేస్తోంది. ఇది మూడు విడతల్లో అందజేస్తున్నారు. 

2023-24 వ్యవసాయ సీజన్ కు సంబంధించి తొలి విడత సాయాన్ని రేపు అందిస్తున్నారు. అందుకోసం రూ.109.74 కోట్లను సీఎం విడుదల చేయనున్నారు. 1.46 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది.
Jagan
YSR Rythu Bharosa
Funds
Farmers
YSRCP
Andhra Pradesh

More Telugu News