Pawan Kalyan: ఇదికదా అసలైన బర్త్​డే గిఫ్ట్​ అంటే.. పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ‘ఓజీ’ గ్లింప్స్

Pawan kalyan OG Movie Glimpse out
  • సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్న పవర్ స్టార్
  • హీరోయిన్‌గా ప్రియాంక మోహన్
  • పవన్ బర్త్‌డే కానుకగా సినిమా గ్లింప్స్ విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ‘బ్రో’ సినిమాతో హిట్ అందుకున్నారు. ఆయన నుంచి రాబోతున్న మరో సినిమా ‘ఓజీ’. ర‌న్ రాజా ర‌న్‌, సాహో చిత్రాల‌ ఫేం సుజీత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ రోజు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. ఆయన బర్త్ డే కానుకగా అభిమానుల కోసం ‘ఓజీ’ వీడియో గ్లింప్స్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది. 101 సెకన్ల నిడివితో కూడిన గ్లింప్స్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌‌తో మొదలైంది. 

‘పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాన్ గుర్తుందా. అది మ‌ట్టి, చెట్లతో పాటు సగం ఊరినే మింగేసింది. కానీ వాడు న‌రికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికి ఏ తుపాన్ కడగకలేకపోయింది. అలాంటోడు మళ్లీ తిరిగివస్తున్నాడంటే..’ అంటూ సాగే వాయిస్ ఓవర్‌‌తో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా స్ట‌యిలిష్ లుక్‌లో సరికొత్తగా కనిపించారు. గత గెటప్, మేనరిజంతో అభిమానులకు పూనకాలు తెప్పించారు. థమన్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా ఆరుళ్ మోహన్‌ హీరోయిన్‌గా నటించింది.
Pawan Kalyan
OG movie
sujeeth
video glimpse

More Telugu News