Dhulipala Narendra Kumar: వచ్చే మే నెల తరువాత తన బతుకేంటో సజ్జల ఆలోచించుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర ఘాటు విమర్శలు

Dhulipalla Narendra counters Sajjala Ramakrishna Reddy remarks on Chandrababu
  • చంద్రబాబుకు ఐటీ నోటీసులు
  • తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సజ్జల
  • అదే స్థాయిలో బదులిచ్చిన ధూళిపాళ్ల
  • తాడేపల్లి క్లర్కు సజ్జల స్థాయికి మించి మాట్లాడుతున్నాడని వ్యాఖ్యలు
  • మీది ఇతరుల బతుకు గురించి మాట్లాడేంత గొప్ప బతుకు కాదులే అంటూ వ్యంగ్యం
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన తీవ్ర విమర్శలను టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఖండించారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ సీనియర్ క్లర్క్ సజ్జల తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. దానికి కారణం ఒత్తిడి అవ్వొచ్చు... ఫ్రస్ట్రేషన్ అవ్వొచ్చు అని ఎద్దేవా చేశారు. 

కారణాలు ఏమైనా... తనది, తన యజమానిది ఇతరుల బతుకుల గురించి మాట్లాడేంత గొప్ప బతుకు కాదని సజ్జల తెలుసుకోవాలని ధూళిపాళ్ల హితవు పలికారు. బిడ్డల దగ్గరకు వెళ్లడానికి కోర్టు అనుమతి పొందాల్సిన నాయకుడి దగ్గర పని చేస్తూ ఇతరుల బతుకుల గురించి మాట్లాతుంటే జనం నవ్వుతున్నారని సజ్జలను ఎత్తిపొడిచారు. 

వచ్చే మే నెలలో ఎన్నికల ఫలితాల తరువాత తన బతుకు ఏంటి అనేది కూడా ఈ క్లర్క్ ఒకసారి ఆలోచించుకోవాలని స్పష్టం చేశారు.
Dhulipala Narendra Kumar
Sajjala Ramakrishna Reddy
Chandrababu
Jagan
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News