Jailer: అమెజాన్ ప్రైమ్ లోకి రానున్న రజనీకాంత్ 'జైలర్'

Rajinikanth Jailer will stream on Amazon Prime from September 7
  • ఆగస్టు 10న విడుదలైన జైలర్
  • రూ.600 కోట్ల వసూళ్లతో బాక్సాఫీసు వద్ద ప్రభంజనం
  • సెప్టెంబరు 7 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ స్టామినా ఏంటో చూపించిన చిత్రం జైలర్. రూ.600 కోట్ల వసూళ్లతో జైలర్ చిత్రం బాక్సాఫీసును ఊపేసింది. తమ చిత్రం భారీ విజయం సాధించడంతో చిత్ర నిర్మాత కళానిధి మారన్... రజనీకి, దర్శకుడికి లగ్జరీ కార్లను బహూకరించడం తెలిసిందే. ఇక అసలు విషయానికొస్తే... జైలర్ ఓటీటీ విడుదలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబరు 7 నుంచి జైలర్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. జైలర్ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న తలైవా అభిమానులకు, సినీ ప్రియులకు ఇది శుభవార్తే.
Jailer
Amazon Prime
OTT
Rajinikanth
Kollywood

More Telugu News